వైజాగ్ లో జోరుగా జరుగుతున్న చరణ్ షూటింగ్!

  • శంకర్ సినిమా షూటింగులో చరణ్ 
  •  ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ
  •  షూటింగులో పాల్గొంటున్న కియారా 
  • ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సునీల్, అంజలి
చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందే ఈ సినిమాకి సంబంధించిన ఓ నాలుగు షెడ్యూల్స్ ను పూర్తిచేశారు. తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా కానిచ్చేస్తున్నారట.  

చరణ్ కాలేజ్ కి సంబంధించిన సన్నివేశాలను .. ఆర్కే బీచ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ను .. చరణ్ కి పోలీసులతో గొడవ జరిగే సీన్ ను ఇంతవరకూ చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్టుగా చెబుతున్నారు. కెరియర్ పరంగా ఇది చరణ్ కి 15వ సినిమా. 

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చరణ్ సరసన నాయికగా కియారా అద్వాని నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో కలిసి చరణ్ సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Ramcharan
Kiara Adwani
Shankar Movie

More Telugu News